Sunday, December 22, 2024

రత్నదీప్ సెలెక్ట్ సూపర్ మార్కెట్‌లో అగ్నిప్రమాదం

- Advertisement -
- Advertisement -

రాజేంద్రనగర్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని బండ్లగూడలో ఆదివారం ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రత్నదీప్ సెలెక్ట్ సూపర్ మార్కెట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో సిబ్బంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బయటకు పరుగులు తీశారు. మాల్‌లో మరమత్తులు చేపడతుండగా మంటలు చెలరేగాయని సిబ్బంది తెలిపారు. పొగలుదట్టంగా వ్యాపించడంతో సిబ్బంది సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు. షాట్ సర్క్యూట్‌తోనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అగ్నిమాపక సిబ్బంది భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News