Thursday, January 23, 2025

బండ్లగూడ, పోచారం స్వగృహ ప్లాట్లు అమ్మకానికి సిద్ధం

- Advertisement -
- Advertisement -

బండ్లగూడలో 1,501 ప్లాట్లు, పోచారంలో 1,470 ప్లాట్లు
ఈ వేలం ద్వారా విక్రయం
ఎవరైనా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు
విక్రయానికి 3 బిహెచ్‌కె డీలక్స్, 3 బిహెచ్‌కె, 2 బిహెచ్‌కె, 1 బిహెచ్‌కె ప్లాట్లు
అధికారులతో సమీక్ష చేసిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

Bandlaguda Pocharam home plot ready for sale

మనతెలంగాణ/హైదరాబాద్:  ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు బండ్లగూడ, పోచారం స్వగృహ ప్లాట్ల విక్రయంపై బుధవారం సంబంధిత అధికారులతో రాష్ట్ర రోడ్లు భవనాలు,గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్లాట్ల విక్రయ విధి, విధానాల తుది రూప కల్పనపై ఆయన అధికారులతో చర్చించారు.

బండ్లగూడలో మొత్తం 1,501 ఫ్లాట్లు విక్రయానికి సిద్ధంగా ఉండగా అందులో పనులు పూర్తయినవి 419 ప్లాట్లు కాగా వీటి (చ. అడుగు రూ.3వేల చొప్పున), కొద్దిగా అసంపూర్తిగా పనులు చేయాల్సినవి 1,082 ప్లాట్లు కాగా వీటి ధర (చ.అడుగు రూ.2,750) చొప్పున విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి వేముల తెలిపారు. పోచారంలో 1,328 ప్లాట్లు ఉండగా అక్కడ చ.అడుగు ధర రూ. 2,500ల చొప్పున, అసంపూర్తిగా ఉన్న 142 ప్లాట్లకు రూ. 2250 చొప్పున విక్రయించనున్నట్లు మంత్రి అధికారులతో తెలిపారు.

బండ్లగూడలో 3 బిహెచ్‌కె డీలక్స్ 345 ప్లాట్లు

బండ్లగూడలో 3 బిహెచ్‌కె డీలక్స్ 345 ప్లాట్లు, 3 బిహెచ్‌కె 444 ప్లాట్లు, 2 బిహెచ్‌కె 712 ప్లాట్లు ఉండగా, పోచారంలో 3 బిహెచ్‌కె డీలక్స్ 91ప్లాట్లు, 3 బిహెచ్‌కె 53 ప్లాట్లు, 2 బిహెచ్‌కె 884 ప్లాట్లు, 1బిహెచ్‌కె 442 ప్లాట్లు విక్రయానికి సిద్ధంగా ఉన్నాయని మంత్రి తెలిపారు. 3 బిహెచ్‌కె డీలక్స్ ప్లాట్‌లో ఒక హల్, 3 బెడ్రూంలు, 3 అటాచ్డ్ టాయిలెట్స్, కిచెన్, స్టోర్ రూమ్, పూజ రూమ్, బాల్కనీ సౌకర్యాలుంటాయని మంత్రి తెలిపారు.

త్వరలో ప్రత్యేక యాప్ అందుబాటులోకి…

3 బిహెచ్‌కె ఫ్లాట్‌లో ఒక హాల్, 3 బెడ్రూంలు, 2 అటాచ్డ్ టాయిలెట్స్, కిచెన్, పూజా రూమ్, బాల్కనీలు ఉంటాయని, 2 బిహెచ్‌కె ప్లాట్‌లో హాల్ విత్ కిచెన్, 2 బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూం, బాల్కనీ, 1బిహెచ్‌కె ప్లాట్‌లు హాల్ విత్ కిచెన్, బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూం, బాల్కనీ ఉంటాయన్నారు. సాధారణ పౌరులు, ఉద్యోగస్తులు ఆసక్తి కలిగిన వారు మీ సేవా ద్వారా లేదా ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి సూచించారు. దీనికి సంంధించి ప్రత్యక యాప్ కూడా అందుబాటులోకి తీసుకు రానున్నట్లు ఆయన చెప్పారు. అర్హులకు బ్యాంక్ లోన్ సౌకర్యం కూడా కల్పిస్తామన్నారు. www.swagruha.telangana.gov.in సైట్‌ను పేపర్ నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచి 30 రోజుల వరకు విజిట్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి తెలిపారు.

6 మోడల్ హౌస్‌ల ఏర్పాటు

కొనుగోలుదారుల కోసం బండ్లగూడ, పోచారంలో 6 చొప్పున మోడల్ హౌస్‌లు ఏర్పాటు చేశామని వాటిని సందర్శించవచ్చని మంత్రి వేముల తెలిపారు. ఆసక్తి కలిగిన వారి కోసం అక్కడికక్కడే అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకునే లా ఏర్పాట్లు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అప్లికేషన్ ఫీజు 1000 రూ.(నాన్ రిఫండబుల్) అని ఆయన తెలిపారు.

లబ్ధిదారుల ఎంపిక లాటరీ పద్ధతిలో…

లబ్ధిదారుల ఎంపిక లాటరీ పద్ధతిలో ఉంటుందని మంత్రి వెల్లడించారు. అందుకు సంబంధించి అధికారులు పకడ్భందీ ఏర్పాట్లు చేయాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అదేశించారు. ఈ సమీక్షలో ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి సునీల్ శర్మ, స్వగృహ సీఈ ఈశ్వరయ్య, ఈఈ భాస్కర్ రెడ్డి, పలువురు అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News