Monday, January 20, 2025

బండ్లగూడ సహాభావన టౌన్ షిప్ సమస్యలను పరిష్కారిస్తా : సుధీర్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

ఎల్బీనగర్ : నాగోల్ బండ్లగూడ సహాభావన టౌన్ షిప్ సమస్యలను పరిష్కారిస్తానని ఎల్బీనగర్ ఏమ్మేల్యే దేవిరెడ్డి సుదీర్‌రెడ్డి తెలిపారు. సహాభావన టౌన్ షిప్ సభ్యులతో కలసి రవాణా రోడ్డు మరియు భవనాల శాఖ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి విజయేందిర బోయిను కలసి సమస్యలు ఆమెకు సుధీర్‌రెడ్డి వివరించారు. ఈసంధర్బంగా ఏమ్మేల్యే మాట్లాడుతూ… సహాభావన టౌన్ షిప్ నిర్మాణం చేపట్టి ఏండ్లు జరిగింది. దీంతో డ్రైనేజీ వ్యవస్ద దెబ్బతిన వల్ల లీకేజీలు ఏర్పడుతున్నాయని ,స్లాబ్స్ లీకేజీ ,సెల్లార్స్ నందు జాయింట్స్ దగ్గర పైపులు లీకేజీ లీక్ కావడంతో సెల్లార్ పాచితో నిండిపోతుంది.

గత వర్షాల కారణంగా టౌన్ షిప్ వెనుక ఉన్న జీఎస్‌ఐ గోడ కూలిపోవడం జరిగిందని తెలిపారు.దీంతో టౌన్ షిప్‌లోకి పాములు ,జంతువులు రావడంతో అపార్టు మెంట్ వాసులు తీవ్ర అందోళన చెందుతున్నారని ,ఓక ఎస్‌టీపీ ప్లాంట్ ,సోలార్ ఫిన్సింగ్ ,ఓపెన్ జిమ్ ,అదనపు లైట్స్ ,కమ్యూనీటీ హల్ నిర్మించాలని ఆమెను కోరానని తెలిపారు. దీంతో ఆమె సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు. ఈకార్యక్రమంలో భారాస డివిజన్ అధ్యక్షులు చిరంజీవి ,పట్నాల విశ్వేశ్వర్‌రావు ,రాధకృష్ణ ,యాదగిరి ,కృష్ణ ,సాయిబాబా ,ఆశోక్‌లు పాల్గోన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News