Wednesday, January 22, 2025

కౌశిక్ రెడ్డి చెప్పు దెబ్బలు తింటావ్ : శోభారాణి

- Advertisement -
- Advertisement -

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మరోసారి వివాదాస్పదంగా మారారు. బీఆర్‌ఎస్ ను వీడిన ఎమ్మెల్యేలకు చీర, గాజులు పంపుతున్నానని వాటిని వేసుకోవాలని ఆయన చేసిన వ్యాఖ్యలపై మహిళా కాంగ్రెస్ నేతలు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బుధవారం గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన మహిళా కాంగ్రెస్ నేతలు బీఆర్‌ఎస్ నేతలను హెచ్చరించారు. కౌశిక్ రెడ్డి, బీఆర్‌ఎస్ నేతలు మహిళలను కించపరచడం మానుకోవాలని, మరోసారి ఆడవారిని కించరుస్తూ మాట్లాడేతే చెప్పుదెబ్బలు తప్పవని మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్ పర్సన్ శోభారాణి హెచ్చరించారు.

ఈ సందర్భంగా లైవ్ లో చెప్పును చూపిస్తూ వార్నింగ్ ఇచ్చారు. రాజకీయాల్లో మహిళలను అవమానించేలా మాట్లాడటం మంచి పద్ధతి కాదని, రాష్ట్ర ఉద్యమంలో అగ్రభాగాన పోరాడింది మహిళలేనన్నారు. మరోసారి చీరలు గాజులు చూపిస్తే కౌశిక్ రెడ్డి చెప్పు దెబ్బలు తినాల్సి వస్తుందని హెచ్చరించారు. మహిళలను కించపరిచేలా మాట్లాడిన పాడి కౌశిక్ రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయాలని అలాగే, పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుని ఆయనను విచారణకు పిలవాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News