Wednesday, January 22, 2025

సంక్రాంతి బరిలో ‘బంగార్రాజు’…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అక్కినేని నాగార్జున, నాగ చైతన్య కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా ‘బంగార్రాజు’. ఇందులో నాగార్జున సరసన సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ నటించగా.. నాగ చైతన్యకు జోడీగా ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సంక్రాంతికి పెద్ద సినిమాలు ఉండడంతో విడదుల తేదీని ఇప్పటివరకు ప్రకటించలేదు. అయితే, కరోనా కారణంగా పెద్ద సినిమాలు వాయిదా పడడంతో ‘బంగార్రాజు’ మూవీని సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేయబోతున్నట్లుగా మూవీ మేకర్స్ ప్రకటించారు. అలాగే ఈ మూవీ నుంచి ‘బంగార’ అనే లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు. చైతన్య, కృతి శెట్టిలు ఈ పాటలో కనువిందు చేయనున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు నాగార్జున నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అనూప్ రూబెన్స్ ఈ మూవీకి సంగీతం అందించారు.

BANGAARA Lyrical Song released from Bangarraju

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News