Friday, December 20, 2024

బెంగళూరులో కాంగ్రెస్ కార్యకర్త దారుణ హత్య

- Advertisement -
- Advertisement -

 

బెంగళూరు: ఉత్తర బెంగళూరులోని చౌడేశ్వరినగర్‌లో బుధవారం రాత్రి ఒక 38 ఏళ్ల కాంగ్రెస్ కార్యకర్తను కొందరు దుండగులు కత్తులతో నరికి దారుణంగా హత్యచేశారు. మృతుడిని లగ్గెరె వాసి రవి కుమార్ అలియాస్ మట్టి రవిగా పోలీసులు గుర్తించారు.
కాంగ్రెస పార్టీ కార్యకర్త అయిన రవి కుమార్ బుధవారం మరో కాంగ్రెస కార్యకర్త ఇచ్చిన పుట్టినరోజు పార్టీకి వెళ్లి ఇంటికి తిరిగివస్తుండగా ఐదారుగురు దుండగులు ఆయనపై దాడి చేసి కత్తులతో నరికి చంపివేశారు.

Also Read: ఫేస్‌బుక్‌లో లైవ్ పెట్టి ఉరేసుకున్నాడు…. వీడియో వైరల్

మద్యం తాగిన మత్తులో ఉన్న రవిపై దుండగులు దాడి చేసి అతడు పారిపోవడానికి ప్రయత్నించగా వెంటాడి మరీ కత్తులతో నరికినట్లు పోలీసులు తెలిపారు. దుండగులు రవి తలపై బండరాయి కూడా వేసినట్లు వారు చెప్పారు. దాడి చేయడానికి ముందు దుండగులు రోడ్డు పక్కన ఉన్న రవి ఫోటో ఉన్న పోస్టర్‌ను చింపివేసినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. రవి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. నందిని లేఅవుట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హంతకులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. హత్య వెనుక కారణం ఇంకా తెలియరాలేదని ఒక సీనియర్ పోలీసు అధికారి చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News