Wednesday, January 29, 2025

బెంగళూరు ఎక్స్ ప్రెస్ కు తప్పిన ప్రమాదం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో బెంగళూరు ఎక్స్ప్రెస్ కు ప్రమాదం తప్పింది . బుధవారం రాత్రి 10 గంటల తర్వాత హైదరాబాద్ నుంచి బెంగళూరు కు బయలుదేరిన బెంగళూరు ఎక్స్ప్రెస్ జడ్చర్ల రైల్వే స్టేషన్ లో కొద్దిసేపు ఆగింది. ఈ క్రమంలో ఒక భోగిలో పొగలు రావడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు . వెంటనే చేరుకున్న రైల్వే సిబ్బంది పొగలను అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం అర్ధ గంట తర్వాత బెంగళూర్ ఎక్స్ప్రెస్ యధావిధిగా బెంగళూరుకు బయలుదేరింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News