Monday, January 20, 2025

బెంగళూరు-హైదరాబాద్ మధ్య 6 లైన్ల రహదారి

- Advertisement -
- Advertisement -
Highway Bangalore-Hyderabad
ఎన్‌హెచ్‌- 44 విస్తరణకు కేంద్రం నిర్ణయం

బెంగళూరు: దేశంలోనే అతి పొడవైన జాతీయ రహదారిగా గుర్తింపు కలిగి కన్యాకుమారి నుంచి కశ్మీరుదాకా ఉండే 44వ నంబరు జాతీయ రహదారిని ప్రస్తుతం ఉండే నాలుగు లైన్ల నుంచి ఆరులైన్లకు విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా బెంగళూరు-హైదరాబాద్‌ మధ్య ప్రయాణం మరింత సరళీకృతం కానుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నిర్మాణాలు చేయనున్నారు. బెంగళూరు, హైదరాబాద్‌ దక్షిణభారత్‌లోని ప్రధాన నగరాలు. దేశంలో అత్యధికంగా ఈ రెండునగరాలలోనే ఐటి, బిటి, ఫార్మా, స్టార్టప్‌ కంపెనీలు ఉన్న విషయం తెలిసిందే. దేశంలోని ఒక మూల నుంచి మరో చివరకు వెళ్లేందుకు 44వ నంబరు జాతీయ రహదారి ఏడు రాష్ట్రాల మీదుగా ఉన్నందున రోజూ వేలాది వాహనాల సంచారం ఉంటుంది.

కర్ణాటక పరిధిలో 150 కిలోమీటర్ల మేర 44వ హైవే ఉంది. బెంగళూరు – హైదరాబాద్‌ మధ్య ప్రస్తుతం ఉండే నాలుగులైన్ల రహదారిని ఆరులైన్లకు విస్తరింపచేసేందుకు రూ.4,750 కోట్లు ఖర్చుకానున్నట్లు అంచనా వేశారు. బెంగళూరు – హైదరాబాద్‌ నగరాల మధ్య 570 కిలోమీటర్ల దూరం ఉంది. గతంలో 12 గంటల పాటు ప్రయాణించాల్సి ఉండేది. నాలుగులైన్ల రహదారి విస్తరించాక ప్రయాణపు వ్యవధి 8 గంటలకు తగ్గింది. ఆరులైన్ల ప్రక్రియ పూర్తయితే ప్రయాణ సమయం మరింత తగ్గుతుంది. రోడ్డు విస్తరణతో పాటు రియల్‌టైం డిజిటల్‌ మేనేజ్‌మెంట్‌ వ్యవస్థను ఏర్పాటు చేసి సూపర్‌ ఇన్‌ఫర్‌మేషన్‌ రహదారిగా మార్చి ప్రయాణికుల ఫ్రెండ్లీగా తీర్చిదిద్దనున్నారు. రహదారి పొడవునా డిజిటల్‌ బోర్డులు, ఆసుపత్రులు, పెట్రోలు బంకులు, ట్రాఫిక్‌ సమాచారాన్ని తెలియచేసే సాంకేతిక విధానం అమలు చేస్తారు. రెండు నగరాల మధ్య రోజూ వేలాది మంది సంచరిస్తుంటారు. విమానంలో అయితే కేవలం గంట వ్యవధిలోనే చేరుకోవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News