మన తెలంగాణ/హైదరాబాద్: పారిశ్రామిక విస్తరణలో అగ్రగామిగా వున్న హైదరాబాద్‌లోని పలు జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు, పరిశ్రమలను బెంగళూరుకు తరలించడాని కి కర్నాటక వల విసురుతున్నది. జాతీయ స్థాయిలోనే కాకుండా ప్రపంచస్థాయిలో ప్రముఖ పారిశ్రామిక నగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌పై కర్నాటక ఫోకస్ పెట్టింది. భారీగా ప్రోత్సాహకాలు ఇస్తామంటూ టాప్ కంపెనీలకు ఎర వేస్తున్నది. ఈ మేరకు ఆ రాష్ట్ర డి ప్యూటీ సిఎం డికె శివకుమార్, పరిశ్రమల శాఖ మంత్రి ఎంబి పాటిల్ తెలంగాణలోని ప్రముఖ కం పెనీలకు లేఖలు రాసినట్టుగా కర్నాటకలోని ఆం గ్ల, స్థానిక దిన పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి.
ఇది హైదరాబాద్‌లో అధికార, పారిశ్రామిక వర్గాల చర్చనీయాంశంగా మారింది. కేవలం సేవల రంగాలకే కాకుండా ఉత్పత్తి రంగానికి కూడా తెలంగాణ ప్రభుత్వం పెద్ద పీట వేసి అందుకు అవసరమైన రోడ్లు, నీరు, విద్యుత్తు ఇతరత్రా సులభతర అనుమతుల విధానాలు ప్రవేశపెట్టింది. దీని తో హైదరాబాద్ నలుదిక్కులా ఐటి కంపెనీలే కా కుండా ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఫాక్స్‌కాన్ లాంటి ఉత్పత్తి కంపెనీలు కూడా ఇక్కడ ప్రా రంభోత్సవాలు జరిపాయి. ఆటోమొబైల్, చిప్, ఎలెక్ట్రానిక్ కంపెనీలు కూడా ఇక్కడ శరవేగంగా రంగ ప్రవేశం చేస్తున్నాయి.
ఇప్పటికే హైదరాబాద్ ఫార్మా ప్రపంచ కేపిటల్ గా పేరు తెచ్చుకొన్నది. దీనికి తోడు పార్చ్యూన్ 500లోని 20కి పైగా ఎం ఎన్‌సి కంపెనీలు ఇక్కడ కాలు మోపాయి. ఐటిలో దేశంలోనే 44 శాతం ఉద్యోగులు ఇక్కడ పని చేస్తున్నారు. బెంగళూరులోని వివిధ కంపెనీల్లో పని చేసే ఉద్యోగులు నెలకు 10వేల మంది లోకేషన్ హైదరాబాద్‌కు మారడానికి దరఖాస్తులు పెట్టుకుంటున్నారంటే హైదరాబాద్ ఎంత ఆకర్షినీయంగా మారిందో చెప్పవచ్చు. దీనితో ఇప్పటి దా కా సిలికాన్ వ్యాలీగా ప్రసిద్ధి చెందిన బెంగళూరు ప్రభ రోజురోజుకూ మసకబారడం ఆ మేరకు వృద్ధి రేటు హైదరాబాద్‌లో పెరగడంతో కన్నడ పాలకు లు ఇక్కడ కంపెనీలు, పరిశ్రమలపై కన్ను వేశారు. ఎలాగైనా ఇక్కడి నుంచి బెంగళూరుకు కంపెనీలు, పరిశ్రమలు తరలి వచ్చేలా అక్కడి పాలకులు ప్ర యత్నాలను ముమ్మరం చేశారు. బెంగళూరును మించి హైదరాబాద్ దూసుకుపోతుండడం కర్నాటక పాలకులకు కంటగింపుగా మారింది. కీన్స్, ఫాక్స్‌కాన్, వెల్‌స్పన్ లాంటి కంపెనీలు బెంగళూరును కాదని హైదరాబాద్‌ను ఎంపిక చేసుకోవడం తో అక్కడి పాలకులు రారమ్మంటూ ఇక్కడ కంపెనీలు, పరిశ్రమలకు గాలం వేస్తున్నాయి. అయితే ట్రాఫిక్, విద్యుత్తు, మంచినీరు, విస్తారమైన మె ట్రో, విశాలమైన ఆరు వరుసల అవుటర్ రింగ్ రోడ్డు లాంటి మౌలిక వసతులు హైదరాబాద్‌ను పారిశ్రామిక పటంలో అగ్రగామిగా నిలిపాయి. బెంగళూరు హైదరాబాద్‌ను అధిగమించాలంటే సదుపాయాల్లో పోటీ పడాలే కాని ఇక్కడి కంపెనీలకు ఎర వేయడం ఏమిటని అధికారులు, పారిశ్రామిక వేత్తలు ప్రశ్నిస్తున్నారు