Sunday, January 19, 2025

బెంగళూరులో ట్రేడింగ్ స్కామ్

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: టెక్ ఇండస్ట్రీ దంపతులు ఆన్ లైన్ ట్రేడింగ్ స్కామ్ లో పోగొట్టుకున్న డబ్బులో చాలా వరకు పోలీసులు తిరిగి రాబట్టారు. పోలీసులు సకాలంలో స్పందించడంతో ఇది సాధ్యమైంది.  సాఫ్ట్ వేర్ ఇంజినీర్ దంపతులు రూ. 1.53 కోట్లు పోగొట్టుకోగా, దానిలో రూ. 1.4 కోట్లను 50 అకౌంట్ల నుంచి  బెంగళూరులోని ఈస్ట్ డివిజన్ సైబర్ క్రైమ్ పోలీసులు తిరిగి రాబట్టారు. ఆన్ లైన్ పెట్టుబడి స్కామ్ లో వారు మోసగించబడ్డారు.

పెట్టుబడి పెడితే బాగా లాభాలొస్తాయని మోసగాళ్లు బనస్వాడీ లో నివసించే దంపతులను నమ్మించారు. స్కామర్లు యూకె నుంచి ఆపరేట్ చేస్తున్నారు. దోచుకున్న డబ్బును బదలాయించేందుకు వారు ఉత్తర భారత దేశానికి చెందిన వ్యక్తుల తో ‘మూలే అకౌంట్ల’ నెట్ వర్క్ నడిపించారు. మోసగాళ్లు వంచితులకు ఫేక్ వెబ్సైట్లను ఇచ్చారు. వాటిని వారే మానిటర్ చేసేవారు.

పెట్టుబడి ఇబ్బడిముబ్బడిగా పెరిగే సరికి బెంగళూరు టెక్కీ దంపతులు తబ్బిబ్బయ్యారు. కానీ వారు డబ్బును విత్ డ్రా చేయాలని ప్రయత్నించినప్పుడు డినైల్ సూచించింది. తర్వాత అకస్మాత్తుగా ఇన్ యాక్సెసిబుల్ అయిపోయింది. స్కామ్ గురించి వారు తెలుపగానే వారిని ప్లాట్ ఫామ్ నుంచి బ్లాక్ చేశారు. దాంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. డబ్బు ఎలా ట్రాన్స్ఫర్ అయిందో ట్రాక్ చేసి 50 అకౌంట్లను పోలీసులు ఫ్రీజ్ చేశారు. పోగొట్టుకున్న సొమ్ములో చాలా వరకు తిరిగి రాబట్టారు.

ఇదిలావుండగా ఆన్ లైన్ పెట్టుబడిలో జాగ్రత్తగా వ్యవహరించాలని పోలీసులు పౌరులను కోరారు. ఏదైనా అనుమానం కలిగితే వెంటనే రిపోర్టు చేయాలనికూడా చెబుతున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News