Monday, December 23, 2024

మేడారానికి టిఎస్ ఆర్‌టిసి పార్శిల్ ద్వారా మొక్కు చెల్లింపులు

- Advertisement -
- Advertisement -

Bangaram by TSRTC parcel to Medaram

 

హైదరాబాద్ : మేడారం వెళ్లలేని భక్తుల కోసం ప్రత్యేకంగా టిఎస్ ఆర్‌టిసి పార్శిల్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. భక్తులు తాము చెల్లించాలనుకునే బంగారాన్ని పార్శిల్లో బుక్ చేస్తే చాలు, ఆ మొక్కును నేరుగా సమక్క- సారలమ్మ అమ్మవార్లకు సమర్పించనున్నారు. దీనికి సంబంధించిన వివరాలను సంస్థ చైర్మన్ బాజిరెడ్డి, ఎండి సజ్జనార్‌లు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. దీనికి సంబంధించిన ఆర్‌టిసి చైర్మన్ బాజిరెడ్డి మాట్లాడుతూ, సంస్థ నష్టాలను చూసుకోకుండా భక్తుల సౌకర్యార్థం ఈ సేవలను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. సంస్థ ఇప్పటికే ఎన్నో వినూత్న కార్యక్రమాలను ప్రారంభించిందని, మేడారం భక్తులకు రవాణా సౌకర్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆయన అధికారులకు సూచించారు. సంస్థ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ విసి సజ్జనార్ మాట్లాడుతూ రాష్ట్రంలోని బన్‌స్టేషన్ల నుంచి ఈ సేవల భక్తులు వినియోగించుకునే విధంగా తగిన కార్యాచరణను రూపొందించినట్లు చెప్పారు.

బస్ స్టేషన్లతో పాటు ముఖ్య కేంద్రాల్లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. 5 కేజీల వరకు బంగారం (బెల్లం)ను పంపించుకోవచ్చని, దేవాదాయ శాఖ సహకారంతో అమ్మ వారికి సమర్పించడంతో పాటు మళ్లీ సంబంధిత భక్తులకు 200 గ్రాముల ప్రసాదంతో పాటు అమ్మవారి పసుపు కుంకుమ, అమ్మ వారి ఫొటో కూడా అందజేస్తామన్నారు. దీనికిగాను 200 కిలోమీటర్ల (బుకింగ్ పాయింట్ నుంచి మేడారం) వరకు రూ.400, ఆపై కిలోమీటర్లకు రూ.450 ఛార్జీలు వసూలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సేవలు ఈ నెల 11 నుంచి 17వ తేదీ వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. ఫోన్ ద్వారా సమాచారం అందిన తరువాత బుక్ చేసిన చోటే ప్రసాదాన్ని తిరిగి పొందవచ్చని ఆయన తెలిపారు. మిగతా వివరాలకు టిఎన్ ఆర్‌టిసి కాల్ సెంటర్ 040-30102829, 040-68153333లతో పాటు వెబ్‌సైట్ https://www.tsrtc.telangana. gov.in ను సంప్రదించవచ్చన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News