Sunday, December 22, 2024

చిన్న బంగార్రాజుతో సంక్రాంతికి వస్తున్నాం

- Advertisement -
- Advertisement -

Bangarraju cinema release on sankranthi
కింగ్ అక్కినేని నాగార్జున, యువ సామ్రాట్ నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం బంగార్రాజు. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా శుక్రవారం విడుదలకానుంది. ఈ సందర్భంగా అక్కినేని నాగార్జున మీడియాతో మాట్లాడుతూ “చిన్న బంగార్రాజుతో ఈ సంక్రాంతికి వస్తున్నాం.

సోగ్గాడేలో యూత్ బంగార్రాజుని మిస్ అయ్యాం. నాగచైతన్య ఎంట్రీతో యూత్‌ఫుల్ ఎనర్జీ కూడా వచ్చినట్టు అయింది. సంక్రాంతికి పండుగలాంటి సినిమా ఇస్తున్నామని ప్రేక్షకులకు మాటిచ్చాం. అనూప్ రూబెన్స్ ‘సోగ్గాడే చిన్ని నాయనా’ కంటే మంచి మ్యూజిక్ ఇచ్చాడు. నా బాడీ లాంగ్వేజ్ కోసం ‘సోగ్గాడే…’ సినిమాను చూడమని చైకి సలహా ఇచ్చాను. సీనియర్ బంగార్రాజు ఆత్మ లోపలకి ప్రవేశించాక నాగచైతన్య బాడీ లాంగ్వేజ్, మాడ్యులేషన్ మారుతుంది. దాని కోసం చై డైలాగ్స్ అన్నీ కూడా నేను రికార్డ్ చేసి ఇచ్చేవాడిని. వాటిని చూసుకుంటూ చై ఫాలో అయ్యాడు. అయితే నాకంటే ఆ యాస మీద దర్శకుడు కళ్యాణ్‌కు ఎక్కువ పట్టుంది. అంతా ఆయనే చూసుకున్నాడు. రమ్యకృష్ణది నాది గోల్డెన్ కాంబినేషన్. మా కెమీస్ట్రీ బాగుంటుంది. రమ్యతో పని చేయడం ఎంతో సరదాగా ఉంటుంది. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ రైటింగ్ అద్భుతంగా ఉంటుంది. ఆయన రాసిన పాట కూడా ఇంకా ట్రెండింగ్‌లోనే ఉంది. ఆయనతో పని చేయడం నాకు ఇష్టం”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News