Saturday, December 21, 2024

పండుగలాంటి సినిమా..

- Advertisement -
- Advertisement -

కింగ్ అక్కినేని నాగార్జున, యువసామ్రాట్ నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘బంగార్రాజు’. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరించారు. కళ్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా ఈనెల 14న థియేటర్లలో విడుదలకానుంది. ఈ నేపథ్యంలో ‘బంగార్రాజు మ్యూజికల్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాగార్జున మాట్లాడుతూ “సినిమాకు సగం సక్సెస్ మ్యూజిక్. ఆ సగం సక్సెస్‌ను అనూప్‌కు ఇస్తున్నాం. చక్కటి మాస్ కమర్షియల్ సాంగ్స్ ఇచ్చాడు. ప్రతి సాంగ్ ఓ వజ్రంలా ఉంటుంది. మంగళవారం ట్రైలర్ రాబోతోంది. ఈనెల 14న సంక్రాంతి రోజున పండుగలాంటి సినిమాను తీసుకొస్తున్నాం”అని అన్నారు. నాగ చైతన్య మాట్లాడుతూ ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరితో కలిసి ఎంజాయ్ చేసేలా ఈ సినిమా ఉంటుందని తెలిపారు. డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ మాట్లాడుతూ “ఈ చిత్రంలో నాగార్జున, నాగచైతన్య పోటీ పడి నటించారు. ఏ పాత్ర బాగుంది.. ఏ పాత్ర బాగాలేదు.. ఏది తక్కువ ఏది ఎక్కువ అనేది ఎవ్వరూ చెప్పలేరు” అని అన్నారు. ఈ కార్యక్రమంలో కృతి శెట్టి, జీ స్టూడియోస్ ప్రసాద్, అనూప్ రూబెన్స్, నాగ సుశీల, సుమంత్, ఫరియా అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు.

‘Bangarraju’ Musical Night Event in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News