Sunday, December 22, 2024

ఫ్లైట్ లో మొగుడూపెళ్లాల ఫైట్: వెనక్కి తిరిగిన విమానం

- Advertisement -
- Advertisement -

ఎంత మొగుడూ పెళ్లాలయితే మాత్రం, ఎక్కడబడితే అక్కడ పోట్లాడుకుంటామంటే కుదురుతుందా? మ్యునిచ్ నుంచి బ్యాంకాక్ కు వెళ్తున్న లుఫ్తాన్సా విమానంలో ఇద్దరు భార్యాభర్తలు పెద్ద సీన్ క్రియేట్ చేశారు. మాటామాట పెరిగి జుట్టూ జుట్టూ పట్టుకోవడంతో వారిని సముదాయించేందుకు ఫ్లైట్ సిబ్బంది ప్రయత్నించారు. వీలుకాకపోవడంతో పైలట్ విమానాన్ని ఢిల్లీ ఎయిర్ పోర్టులో దించి, పోలీసులకు కంప్లెయింట్ చేశాడు.

గొడవ పడిన భార్యాభర్తల్లో 53 ఏళ్ల భర్తది జర్మనీ కాగా భార్యది థాయ్ లాండ్. ఇద్దరి మధ్య గొడవ ప్రారంభమయ్యాక, తోటి ప్రయాణికులు సర్ది చెప్పేందుకు ప్రయత్నించారు. అయినా ఇద్దరిలో ఎవరూ తగ్గలేదు. ఈలోగా భార్య.. పైలట్ వద్దకు వెళ్లి భర్తపై కంప్లెంట్ చేసింది. తనపై తినుబండారాలు విసిరేశాడనీ, లైటర్ సహాయంతో దుప్పటికి నిప్పు పెట్టేందుకు ప్రయత్నించాడని ఫిర్యాదు చేసింది.

గొడవ సద్దుమణకపోవడంతో పైలట్లు పాకిస్తాన్ లో విమానాన్ని ల్యాండ్ చేసేందుకు ప్రయత్నించారు. అక్కడి అధికారులు అనుమతించకపోవడంతో ఢిల్లీ విమానాశ్రయ అధికారులను సంప్రదించారు. విమానం ఢిల్లీలో ల్యాండ్ కాగానే భర్త మహాశయుణ్ని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అధికారులు విమానం నుంచి దింపేశారు. అతని భార్య వేరే పిఎన్ఆర్ టికెట్ తో ప్రయాణిస్తున్నారు. తాను బ్యాంకాక్ కు ప్రయాణం కొనసాగిస్తానని ఆమె చెప్పడంతో అందుకు అనుమతించారు. గొడవ సద్దుమణిగాక విమానం బ్యాంకాక్ కు బయల్దేరింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News