Tuesday, December 24, 2024

ఉత్కంఠ పోరులో టీమిండియాపై బంగ్లా గెలుపు.. వన్డే సిరీస్ కైవసం

- Advertisement -
- Advertisement -

ఢాకా: భారత్‌తో ఉత్కంఠభరితంగా సాగిన రెండో వన్డేలో ఆతిథ్య బంగ్లాదేశ్ ఐదు పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో బంగ్లాదేశ్ మరో మ్యాచ్ మిగిలివుండగానే 20 తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకుంది. బుధవారం ఇక్కడి షేరే బంగ్లా నేషనల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన టీమిండియా 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 266 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. ఊరిస్తున్న లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన భారత్‌కు ఆరంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. ఓపెనర్‌గా దిగిన విరాట్ కోహ్లి ఐదు పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఆ వెంటనే మరో ఓపెనర్ శిఖర్ ధావన్ కూడా ఔటయ్యాడు. ధావన్ 8 పరుగులు మాత్రమే చేశాడు. ఇక బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకు వచ్చిన వాషింట్టన్ సుందర్ కూడా నిరాశ పరిచాడు. 11 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. ఇక జట్టును ఆదుకుంటాడని భావించిన వైస్ కెప్టెన్ కెఎల్ రాహుల్ కూడా విఫలమయ్యాడు. 14 పరుగులు మాత్రమే చేసి ఇంటిదారి పట్టాడు. దీంతో భారత్ 65 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది.

ఆదుకున్న శ్రేయస్, అక్షర్
ఈ దశలో ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్‌లు తమపై వేసుకున్నారు. ఇద్దరు బంగ్లాదేశ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. ఒకవైపు సమన్వయంతో ఆడుతూనే అడపాదడపా ఫోర్లు, సిక్సర్లతో స్కోరును పరిగెత్తించారు. ఈ జోడీని విడగొట్టేందుకు బంగ్లా బౌలర్లు చాలా సేపటి వరకు వేచి చూడాల్సి వచ్చింది. ఇటు అయ్యర్ అటు అక్షర్ కుదురు కోవడంతో భారత్ లక్షం దిశగా అడుగులు వేసింది. అయితే 6 ఫోర్లు, మూడు సిక్సర్లతో 82 పరుగులు చేసిన శ్రేయస్ కీలక సమయంలో పెవిలియన్ చేరాడు. దీంతో 107 పరుగుల ఐదో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ఆ వెంటనే అక్షర్ కూడా ఔటయ్యాడు. 3 సిక్సర్లు, రెండు ఫోర్లతో 56 పరుగులు చేసిన అక్షర్‌ను మెహదీ హసన్ వెనక్కి పంపాడు. దీంతో టీమిండియా కష్టాలు మళ్లీ మొదటికొచ్చాయి.

రోహిత్ మెరుపులు వృథా
మరోవైపు గాయంతో బాధపడుతున్న కెప్టెన్ రోహిత్ శర్మ 8వ వికెట్ రూపంలో క్రీజులోకి వచ్చాడు. ఒకవైపు నొప్పి బాధిస్తున్నా రోహిత్ మాత్రం వీరోచిత బ్యాటింగ్‌తో భారత్‌కు దాదాపు గెలిపించినంత పని చేశాడు. బంగ్లా బౌలర్లపై ఎదురుదాడికి దిగిన రోహిత్ 28 బంతుల్లోనే 5 భారీ సిక్సర్లు, మూడు ఫోర్లతో అజేయంగా 51 పరుగులు చేశాడు. అయితే కీలక సమయంలో బంగ్లా బౌలర్లు పొదుపుగా బౌలింగ్ చేయడం, సిరాజ్ మరి ఆత్మరక్షణ బ్యాటింగ్‌ను కనబరచడంతో భారత్ విజయానికి ఐదు పరుగుల దూరంలో నిలిచి పోయింది.

మెహదీ హస్ మెరుపులు
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్‌కు కూడా శుభారంభం లభించలేదు. ఓపెనర్లు అనముల్ (11), లిటన్ దాస్ (7) మెరుగైన ఆరంభాన్ని ఇవ్వలేక పోయారు. అంతేగాక షాంటానో (21), షకిబ్ (8), ముష్ఫికుర్ రహీం (12), ఆఫిఫ్ హుస్సేన్ (0)లు నిరాశ పరిచారు. దీంతో బంగ్లాదేశ్ 69 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. ఈ దశలో ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను సీనియర్లు మహ్మదుల్లా, మెహదీ హసన్ మిరాజ్ తమపై వేసుకున్నారు. ఇద్దరు భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ఇన్నింగ్స్‌ను కుదుట పరిచారు. ఈ జోడీని విడగొట్టేందుకు భారత బౌలర్లు చేసిన ప్రయత్నాలు చాలా సేపటి వరకు ఫలించలేదు. కీలక ఇన్నింగ్స్ ఆడిన మహ్మదుల్లా ఏడు ఫోర్లతో 77 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక మెరుపు ఇన్నింగ్స్ ఆడిన మెహదీ హసన్ 83 బంతుల్లోనే 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 100 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. నాసుమ్ అహ్మద్ 18 (నాటౌట్) కూడా రాణించడంతో బంగ్లాదేశ్ స్కోరు 271 పరుగులకు చేరింది. మరోవైపు ఆల్‌రౌండ్‌షోతో అదరగొట్టిన మెహదీ హసన్ ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది.

అక్ష‌ర ప‌టేల్(56) రాణించారు.

మిగతా వారు ఘోరంగా విఫలమవ్వగా.. చివర్లలో కెప్టెన్ రోహిత్ శ‌ర్మ(51 నాటౌట్: 28 బంతుల్లో 5సిక్స్‌లు, 3 ఫోర్ల‌ు) బ్యాట్ ఝుళిపించినా మ్యాచ్ గెలిపించలేకపోయాడు. నిర్ణీత 50 ఓవర్లలో టీమిండియా 9 వికెట్ల నష్టానికి 266 పరుగులు చేసింది. దీంతో టీమిండియాపై బంగ్లా 5 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే బంగ్లాదేశ్ 2-0తో మూడు వన్డేల సిరీస్ కైవసం చేసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News