Monday, December 23, 2024

బంగ్లాదేశ్ చారిత్రక విజయం

- Advertisement -
- Advertisement -

నేపియర్: న్యూజిలాండ్ గడ్డపై బంగ్లాదేశ్ క్రికెట్ నయా చరిత్ర సృష్టించింది. శనివారం న్యూజిలాండ్‌తో జరిగిన చివరి వన్డేలో బంగ్లాదేశ్ 9 వికెట్ల తేడాతో చారిత్రక విజయం సాధించింది. కివీస్ గడ్డపై బంగ్లాదేశ్ వన్డేల్లో తొలి విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో ఓడినా ఆతిథ్య న్యూజిలాండ్ 21 తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకుంది. తొలి రెండు వన్డేల్లో కివీస్ విజయం సాధించగా, చివరి వన్డేలో బంగ్లాదేశ్ జయకేతనం ఎగుర వేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 31.4 ఓవర్లలో 98 పరుగులకే కుప్పకూలింది.

బంగ్లా ఫాస్ట్‌బౌలర్లు సమష్టిగా రాణించి మొత్తం పది వికెట్లను తమ ఖాతాలో వేసుకున్నారు. షరిఫుల్ ఇస్లామ్, తంజీమ్, సౌమ్య సర్కార్ మూడేసివికెట్లను పడగొట్టారు. ముస్తఫిజుర్‌కు ఒక వికెట్ దక్కింది. కివీస్ టీమ్‌లో నలుగురు మాత్రమే రెండంకెల స్కోరును అందుకున్నారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 15.1 ఓవర్లలోనే కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది.అనముల్ హక్ (37), కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ 51 (నాటౌట్) జట్టును గెలిపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News