Wednesday, January 8, 2025

రెండో టెస్టులో బంగ్లా ఘన విజయం

- Advertisement -
- Advertisement -

వెస్టిండీస్‌తో జరిగిన రెండో, చివరి టెస్టులో బంగ్లాదేశ్ 101 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో బంగ్లాదేశ్ రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. తొలి టెస్టులో విండీస్ జయకేతనం ఎగుర వేసిన విషయం తెలిసిందే. జమైకా వేదికగా జరిగిన రెండో టెస్టులో బంగ్లాదేశ్ చారిత్రక ప్రదర్శనతో అలరించింది. విండీస్‌ను వారి సొంత గడ్డపై ఓడించి నయా చరిత్ర సృష్టించింది. 286 పరుగుల లక్షంతో రెండో ఇన్నింగ్స్ చేపట్టిన ఆతిథ్య వెస్టిండీస్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో బంగ్లా బౌలర్లు సఫలమయ్యారు. తైజుల్ ఇస్లామ్ ఈ మ్యాచ్‌లో అసాధారణ బౌలింగ్‌ను కనబరిచాడు. వరుస క్రమంలో వికెట్లను తీస్తూ విండీస్ బ్యాటింగ్ లైనప్‌ను కుప్పకూల్చాడు.

అద్భుత బౌలింగ్‌ను కనబరిచిన తైజుల్ 50 పరుగులకు ఐదు వికెట్లు పడగొట్టాడు. హసన్ మహమూద్, తస్కిన్ అహ్మద్‌లు చెరో రెండు వికెట్లు తీసి తమవంతు పాత్ర పోషించారు. విండీస్ టీమ్‌లో ఓపెనర్‌గా దిగిన కెప్టెన్ క్రెగ్ బ్రాత్‌వైట్ (43), కెవెమ్ హడ్జ్ (55) మాత్రమే రాణించారు. మిగతా వారిలో జస్టిన్ గ్రీవ్స్ (20), కార్టి (14), జోషువా డి సిల్వా (12) మాత్రమే డబుల్ డిజిట్ స్కోరును అందుకున్నారు. ఇతర బ్యాటర్లు విఫలం కావడంతో విండీస్‌కు ఓటమి తప్పలేదు. ఇక బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 164, రెండో ఇన్నింగ్స్‌లో 268 పరుగులు చేసింది. విండీస్ మొదటి ఇన్నింగ్స్‌లో 146 పరుగులకే కుప్పకూలింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News