బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా, ఆమె కూతురు సైమా వాజెద్ పుతుల్, మరి 17 మంది ఇతరులను లంచం కేసులో అరెస్టు చేసేందుకు బంగ్లాదేశ్ కోర్టు మరో కొత్త వారెంట్‌ను జారీచేసింది. మోసపూరిత విధానాలతో వారు నివాస స్థలాలు సేకరించారని ఆరోపించింది. ఢాకా మెట్రోపాలిటన్ సీనియర్ స్పెషల్ జడ్జీ జాకీర్ హుస్సేన్ గాలిబ్ అవినీతి నిరోధక కమిషన్(ఎసిసి) సమర్పించిన ఛార్జ్‌షీట్‌ను ఆమోదించారు. నిందితులు పారారీలో ఉన్నందున కోర్టు వారికి వ్యతిరేకంగా వారెంట్లను జారీచేసింది. పదవీవిచ్యుతురాలైన షేక్ హసీనా, తదితర నిందితులపై యాంటీ-కరప్షన్ కమిషన్ (ఎసిసి) 2025 జనవరి 12న కేసు దాఖలు చేసింది. 16 ఏళ్లపాటు అధికారంలో కొనసాగిన హసీనా తాలూకు అవామీ లీగ్ ప్రభుత్వం 2024 ఆగస్టు 5న విద్యార్థుల సమ్మె కారణంగా కూలిపోయింది. పదవి కోల్పోయిన 77 ఏళ్ల షేక్ హసీనా ప్రస్తుతం ఇండియాలో తలదాచుకుంటున్నారు. హసీనాను తమకు అప్పగించాలన్న బంగ్లాదేశ్ అభ్యర్థనను ఇండియా ఇంతవరకు మన్నించలేదనే చెప్పాలి.
షేక్ హసీనాకు అరెస్టు వారెంట్ జారీచేసిన బంగ్లాదేశ్ కోర్టు
- Advertisement -
- Advertisement -
- Advertisement -