- Advertisement -
ఢాకా: 14మంది ఇస్లామిక్ ఉగ్రవాదులకు బంగ్లాదేశ్‌లోని కోర్టు మరణశిక్ష విధించింది. 2000 సంవత్సరంలో బంగ్లాదేశ్ ప్రధాని షేఖ్‌హసీనాను హత్యగావించేందుకు కుట్ర పన్నిన కేసులో ఢాకాలోని స్పీడీ ట్రయల్ ట్రిబ్య్రునల్1 మంగళవారం ఈ తీర్పు వెల్లడించింది. తీర్పు సమయంలో 9మంది దోషులు కోర్టుకు హాజరయ్యారు. మరో ఐదుగురు పరారీలో ఉన్నారు. బంగ్లాదేశ్ రాజ్యాంగం ప్రకారం మరణ శిక్షల్ని హైకోర్టు డివిజన్ బెంచ్ ధ్రువీకరించిన తర్వాత అమలు చేస్తారు. పరారైన ఐదుగురికి అరెస్టయిన తర్వాత మరణశిక్ష అమలు చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఈ కేసులోని దోషులంతా హర్కతుల్ జిహాద్ బంగ్లాదేశ్ సంస్థకు చెందినవారు.
- Advertisement -