Sunday, December 22, 2024

బంగ్లాదేశ్ శుభారంభం

- Advertisement -
- Advertisement -

టి20 వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్ మహిళల జట్టు శుభారంభం చేసింది. గురువారం జరిగిన గ్రూప్‌బి తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 16 పరుగుల తేడాతో స్కాట్లాండ్ విమెన్స్ టీమ్‌ను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ టీమ్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన స్కాట్లాండ్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లకు 103 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. ఓపెనర్‌గా దిగిన వికెట్ కీపర్ సారా బ్రైస్ ఒక్కటే ఒంటరి పోరాటం చేసింది. బంగ్లా బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న సారా52 బంతుల్లో ఒక ఫోర్‌తో 49 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. మిగతా వారిలో కెప్టెన్ కాత్రిన్ బ్రైస్ (11), అలీసా లిస్టర్ (11) రెండంకెల స్కోరును అందుకున్నారు. మిగిలిన బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.

ప్రత్యర్థి టీమ్ బౌలర్లలో రితూ మోని 15 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లను పడగొట్టింది. మిగతా బౌలర్లు కూడా కచ్చితమైన లైన్ అండ్ లెన్త్‌తో బౌలింగ్ చేసి బంగ్లాను గెలిపించారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో స్కాట్లాండ్ బౌలర్లు సఫలమయ్యారు. ఓపెనర్ శాతి రాణి (29) పరుగులు చేసింది. వన్‌డౌన్‌లో వచ్చిన శోభన (36) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. కెప్టెన్ నిగర్ సుల్తానా (18) పరుగులు సాధించింది. చివర్లో ఫహిమా ఖాతున్ 10 (నాటౌట్) ధాటిగా ఆడింది. దీంతో బంగ్లా స్కోరు 119 పరుగులకు చేరింది. ప్రత్యర్థి జట్టు బౌలర్లలో సస్కియా హార్లి మూడు వికెట్లను పడగొట్టింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News