Monday, January 20, 2025

ప్రజాస్వామ్యాన్ని, ఓటుహక్కును నిర్ధారించిన ఎన్నికలు : షేక్ హసీనా

- Advertisement -
- Advertisement -

ఢాకా : బంగ్లాదేశ్‌లో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తమ అవామీ లీగ్ పార్టీ అఖండ విజయం సాధించడం బంగ్లాదేశ్ ప్రజల విజయమని, ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యాన్ని, ప్రజల ఓటుహక్కును కొనసాగించాయని బంగ్దాదేశ్ ప్రధాని షేక్ హసీనా మంగళవారం పేర్కొన్నారు. జనవరి 7న జరిగిన ఈ ఎన్నికలను ప్రధాన విపక్షం బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ (బిఎన్‌పి) బహిష్కరించగా, హసీనా నేతృత్వం లోని అవామీ లీగ్ (ఎఎల్) అఖండ విజయం సాధించింది. ప్రపంచం మొత్తం మీద ఉన్న వందలాది ప్రవాసీ అవామీ లీగ్ కార్యకర్తలు ఢాకా లోని హసీనా అధికారిక నివాసం ‘గణభబన్’ వద్దకు మంగళవారం చేరుకుని 12 వ పార్లమెంట్ ఎన్నికల్లో వరుసగా నాలుగోసారి అవామీ లీగ్ పార్టీ విజయం సాధించగా, హసీనాను అభినందించారు. వారిని ఉద్దేశిస్తూ హసీనా మాట్లాడారు.

ఈ ఎన్నికల ద్వారా ప్రజల రాజ్యాంగపరమైన ఓటు హక్కును నిర్ధారించగలిగామని ఆమె తెలిపారు. ఎన్నికల్లో పాల్గొనకుండా బహిష్కరించిన విపక్షం బిఎన్‌పిపై ఆమె ధ్వజమెత్తారు. 2008 ఎన్నికల్లో బీఎన్‌పి తమ మిత్రపక్షాలైన 20 పార్టీల పొత్తుతో కేవలం 30 స్థానాలనే సాధించగా, తమ అవామీ లీగ్ ఒక్కటే 233 స్థానాలను గెలుచుకోగలిగిందని గుర్తు చేశారు. అప్పటి ఎన్నికలు తటస్థ ఆపద్ధర్మ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగాయని ఏ విధంగా తాము బిఎన్‌పిని ఎదుర్కోగలిగామో ఆమె చెప్పారు. సంస్థాపరంగా అవామీ లీగ్‌తో సమానమైన బలం బిఎన్‌పికి ఉందని ఆనాడు చాలామంది అనుకున్నారని, కానీ అదంతా పొరపాటని ఆ ఎన్నికలు రుజువు చేశాయని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News