Sunday, January 19, 2025

ఒక్క క్యాచ్ పట్టేందుకు పల్టీలు కొట్టిన ముగ్గురు ఫీల్డర్లు! (వీడియో)

- Advertisement -
- Advertisement -

బంగ్లాదేశ్, శ్రీలంక మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. జహుర్ అహ్మద్ చౌధురి స్టేడియంలో జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజున లంక బ్యాటర్ ప్రభాత్ జయసూర్య క్రీజులో ఉన్నప్పుడు ఈ సంఘటన జరిగింది.

బంగ్లాదేశ్ బౌలర్ ఖాలేద్ అహ్మద్ వేసిన బంతిని జయసూర్య కవర్స్ మీదుగా షాట్ కొట్టాడు. కానీ బంతి బ్యాట్ వెలుపలి అంచుకు తగిలి, ఫస్ట్ స్లిప్ లో ఉన్న నజ్ముల్ హొస్సేన్ శాంటో చేతిలో పడింది. అయితే బంతిని షాంటో సరిగ్గా పట్టుకోలేకపోయాడు. అతని చేతిలోంచి బంతి పైకెగిరి సెకండ్ స్లిప్ లో ఉన్న షనాదత్ దీపు చేతికి చిక్కినట్టే చిక్కి జారిపోయింది. ఆ బంతిని అక్కడే ఉన్న మరో ఫీల్డర్ జాకిర్ హసన్ పట్టుకోబోయి, నేలపాలు చేశాడు. బంతిని పట్టుకునేందుకు ముగ్గురు ఫీల్డర్లూ చేసిన రకరకాల విన్యాసాలతో  ప్రేక్షకులు ఫక్కుమన్నారు. ఈ వీడియో నెట్ లో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఫీల్డింగ్ ఎలా చేయకూడదో వీరిని చూసి నేర్చుకోవాలంటూ ఓ నెటిజన్ చురకలంటించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News