Tuesday, January 7, 2025

బంగ్లాదేశ్‌కు సవాల్

- Advertisement -
- Advertisement -

నేడు లంకతో కీలక పోరు

కొలంబో : ఆసియాకప్ సూపర్4లో భాగంగా శనివారం శ్రీలంకతో జరిగే మ్యాచ్ బంగ్లాదేశ్‌కు కీలకంగా మారింది. పాకిస్థాన్‌తో జరిగిన సూపర్ 4 తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఓటమి పాలైన విషయం తెలిసిందే. దీంతో ఈ మ్యాచ్ బంగ్లాకు చాలా కీలకమని చెప్పాలి. ఫైనల్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే లంకపై భారీ తేడా తో గెలవక తప్పదు. మరోవైపు లీగ్ దశలో బంగ్లాదేశ్‌ను ఓడించిన లంక మరోసారి అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని భావిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో లంక సమతూకంగా కనిపిస్తోంది. ఓపెనర్లు పాథుమ్ నిసాంకా, కరుణరత్నెలతో పాటు మెండిస్, అసలంక, సమర విక్రమ, ధనంజయ డిసిల్వాలతో బ్యాటింగ్ బలంగా ఉంది. అఫ్గాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మెండిస్, నిసాంకా, కరుణరత్నె, దునిథ్ తదితరు లు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఈ మ్యాచ్‌లో కూడా వీరిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. ఇక తీక్షణ, రజిత, పతిరణ, దాసున్ శనక, దునిథ్ తదితరులతో బౌలింగ్ కూగా పటిష్టంగానే ఉంద ని చెప్పాలి. ఇక బంగ్లాదేశ్‌లోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదు. నయీం, మెహదీ హసన్ మీరాజ్, లిటన్ దాస్, కెప్టెన్ షకిబ్, కీపర్ రహీం, ఆఫిఫ్, షమీమ్‌లతో బ్యాటింగ్ మెరుగ్గానే ఉంది. దీంతో పోరు ఆసక్తికరంగా సాగడం ఖాయం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News