Monday, December 23, 2024

బంగ్లాదేశ్ లో మారణకాండ.. హీరోను కొట్టి చంపేశారు

- Advertisement -
- Advertisement -

బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి.. దేశం విడిచిపెట్టి వెళ్లినా మారణకాండ మాత్రం ఆగడంలేదు. అల్లరిమూకలు మరింత రెచ్చిపోతున్నారు. 24 గంటల్లోనే 100మందికి పైగా పోలీసులను చంపారు. సినీ నటుడు, నిర్మాతను కూడా కొట్టి చంపినట్లు వార్తలు వస్తున్నాయి. బంగ్లాదేశ్‌లో ప్రముఖ సినీ నిర్మాత సలీం ఖాన్, అతని కుమారుడు హీరో షాంటో ఖాన్‌ను కొందరు ఆందోళనకారులు కొట్టి చంపేశారు. ఆందోళనకారుల నుంచి తప్పించుకుని పారిపోయేందుకు ప్రయత్నించినా.. వెంబడించి ఇద్దరిని పట్టుకుని దారుణంగా కొట్టి చంపారు. కాగా..షాంటో, బాబూజాన్, అంటో నగర్ వంటి సినిమాల్లో నటించారు. ఇక, అతని తండ్రి సలీం ఖాన్ దాదాపు 10 సినిమాల నిర్మించారు.

ఇదిలావుంటే.. బంగ్లాదేశ్ లో అల్లర్లు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యమంత్రి హసీనా పార్టీ నేతలు, హిందువులే టార్గెట్ దాడులు చేస్తున్నారు. దీంతో ఇప్పటివరకు బంగ్లాలో మరణించినవారి సంఖ్య వెయ్యికి చేరినట్లు తెలుస్తోంది. అయితే, ఈ అల్లర్లకు లండన్ వేదికగా కుట్ర జరిగినట్లు బంగ్లాదేశ్ ఇంటలిజెన్స్ అధికారులు గుర్తించినట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News