చిట్టగాంగ్: బంగ్లాదేశ్ లో తమపై పెరుగుతున్న దాడులకు నిరసనగా అక్కడి హిందువులు దేశవ్యాప్తంగా నిరసనలు ప్రదర్శించారు. హిందూ ఉపాధ్యాయులను చంపడం, మహిళలపై అత్యాచారాలు జరగుతుండడంతో హిందూ సముదాయం నిరసన ప్రదర్శనలు జరిపారు. హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా శుక్రవారం చిట్టగాంగ్ లో భారీ నిరసన ప్రదర్శన జరిపారు. బంగ్లాదేశ్ లో రోజురోజుకు హిందువులపై దాడులు పెరుగుతున్నాయని సమాచారం. ఓ కథనం ప్రకారం నరైల్ సహపారలో హిందువులపై జరిగిన దాడులతో ఈ నిరసన రాజుకుందని తెలుస్తోంది. ఇదిలావుండగా దేశంలో మతసామరస్యాన్ని దెబ్బతీసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని బంగ్లాదేశ్ హోం మంత్రి అస్సదుద్జమా ఖాన్ తెలిపారు. అక్కడి మానవ హక్కుల కమిషన్ కూడా దాడులపై దర్యాప్తు జరపాలని హోం మంత్రిత్వ శాఖను డిమాండ్ చేసింది. ఒక వార్తా కథనం ప్రకారం నరైల్ సహపారాలో శుక్రవారం హిందువు ఇళ్లను తగులబెట్టడంతో ఇదంతా మొదలయిందని తెలుస్తోంది.
బంగ్లాదేశ్ లో హిందువుల దేశవ్యాప్త నిరసన !
- Advertisement -
- Advertisement -
- Advertisement -