Saturday, November 23, 2024

అది మా అంతర్గత విషయం: బంగ్లాదేశ్ హోంమంత్రి

- Advertisement -
- Advertisement -

Bangladesh HM
ఢాకా: బంగ్లాదేశ్‌లో ఇటీవల జరిగిన హింసాత్మక ఘటనలపై ఆ దేశ హోం మంత్రి అసదుజ్జమాన్ ఖాన్ ప్రతిస్పందించారు. అది తమ దేశ అంతర్గత విషయమన్నారు. ఢాకాకు దాదాపు 100 కిమీ. దూరంలో కుమిలా వద్ద దుర్గాపూజ మండపంలో దైవదూషణ కారణంగా ఈ హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయని ఆయన తెలిపారు. అయితే బంగ్లాదేశ్‌లోని హిందువులపై హింసాకాండ నిరాటంకంగా కొనసాగుతోంది. కానీ మత సామరస్యాన్ని కాపడతామని అసదుజ్జమాన్ వాగ్దానం చేశారు. రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ఈ హింసాకాండకు పాల్పడ్డారని ఆయన అభిప్రాయపడ్డారు. బంగ్లాదేశ్ లో 2023లో ఎన్నికలు జరుగనున్నాయి. పిటిఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో  ఆయన దేశంలో హింసను ప్రోత్సహిస్తున్న దోషులను పట్టుకుంటామని, దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. ఈ దాడుల వెనుక బిఎన్‌పి-జమాత్ శక్తులు ఉన్నాయనేది కాదనలేమని కూడా ఆయన తెలిపారు. సమస్యలను సృష్టించేవారిని వదిలిపెట్టే ప్రసక్తేలేదని ఆయన తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News