Wednesday, February 12, 2025

బంగ్లాదేశ్‌లో డిసెంబర్‌లో సార్వత్రిక ఎన్నికలు: ఈసి

- Advertisement -
- Advertisement -

బంగ్లాదేశ్‌లో డిసెంబర్‌లో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నట్లు, అందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నట్లు బంగ్లాదేశ్ ఎన్నికల సంఘం మంగళవారం తెలిపింది. బంగ్లాదేశ్‌లో డిసెంబర్‌లో దేశవ్యాప్తంగా విధ్వంసకాండ జరిగాక సార్వత్రిక ఎన్నికల ప్రతిపాదనకు తాత్కాలిక ప్రభుత్వ చీఫ్ ముహమ్మద్ యూనుస్ ఒప్పుకున్నట్లు తెలిసింది. డిసెంబర్ నాటికి ఎన్నికలు నిర్వహిస్తామని మజీ ప్రధాని ఖలీదా జియాకు చెందిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బిఎన్‌పి)కి మూనుస్ హామీ ఇచ్చిన మరునాడు ఈసి ఈ వ్యాఖ్యలు చేసింది.

ఎన్నికల కమిషనర్ అబుల్ ఫజల్ మొహమ్మద్ సనావుల్లా విలేకరులతో మాట్లాడుతూ ‘ఈ సంవత్సరం డిసెంబర్‌లో సార్వత్రిక ఎన్నికలకు మేము సిద్ధమవుతున్నాము’ అన్నారు. సమావేశంలో పాల్గొన్న ఐక్యరాజ్యసమితి రెసిడెంట్ ప్రతినిధి స్టీఫన్ లిల్లర్ మాట్లాడుతూ, రాబోయే ఎన్నికలు బంగ్లాదేశ్ చరిత్రలో అత్యుత్తమం కానున్నాయని ఐక్యరాజ్యసమితి అంచనా వేసిందన్నారు. ‘స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా ఎన్నికలు నిర్వహించడానికి మేము ఈసికి మద్దతు ఇస్తున్నాము’ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News