Sunday, January 19, 2025

రెండో వికెట్ కోల్పోయిన బంగ్లా

- Advertisement -
- Advertisement -

ఛట్టోగ్రామ్: జహుర్ అహ్మాద్ చౌదరీ స్టేడియంలో భారత్-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ నాలుగో రోజు బంగ్లదేశ్ 50 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 131 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. నిజ్ముల్ హుస్సేన్ శాంటో, జాకీర్ హుస్సేన్ హాఫ్ సెంచరీలతో కదంతొక్కారు. ఓపెనర్లు తొలి వికెట్‌పై 124 పరుగులు చేశారు. నిజ్ముల్ 67 పరుగులు చేసి ఉమేష్ యాదవ్ బౌలింగ్‌లో రిషబ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. యాసిర్ అలీ ఐదు పరుగులు చేసి అక్షర పటేల్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. భారత జట్టు ఇప్పటి వరకు 382 పరుగుల ఆధిక్యంలో ఉంది. ప్రస్తుతం క్రీజులో జాకీర్ హసన్(59), లిట్టన్ దాస్(0) బ్యాటింగ్ చేస్తున్నారు.

ఇండియా తొలి ఇన్నింగ్స్: 404
ఇండియా రెండో ఇన్నింగ్స్: 258/2 డిక్లేర్డ్
బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్: 150

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News