Thursday, January 23, 2025

ఆరో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్

- Advertisement -
- Advertisement -

మీర్‌పూర్: షీర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో భారత్-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్ తొలి రోజు బంగ్లాదేశ్ 66.3 ఓవర్ల ఆరు వికెట్లు కోల్పోయి 213 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. మోమినల్ హాక్ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. నిజ్మల్ హోస్సేన్ శాంటో 24 పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్‌లో ఎల్‌బిడబ్ల్యు రూపంలో ఔటయ్యాడు. జకీర్ హసన్ 15 పరుగులు చేసి ఉనద్కత్ బౌలింగ్‌లో రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు.

షకీబ్ అల్ హసన్ 16 పరుగులు చేసి ఉమేష్ బౌలింగ్ లో పూజారాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ముష్ఫికర్ రహీమ్ 26 పరుగులు చేసి ఉనద్కత్ బౌలింగ్ లో పంత్ కు క్యాచ్ ఇచ్చి నాల్గో వికెట్ రూపంలో మైదానం వీడాడు. లిట్టన్ దాస్ 25 పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్ లో రాహుల్ కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. మెహిడీ హసన్ మిరాజ్ 15 పరుగులు చేసి ఉమేష్ బౌలింగ్ లో పంత్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో మోమినల్ (81), నురుల్ హసన్ (00) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. భారత్ బౌలర్లలో ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, రవిచంద్రన్ అశ్విన్ తలో రెండు వికెట్లు తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News