Sunday, December 22, 2024

ఆరో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్

- Advertisement -
- Advertisement -

ఢాకా: షీర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో భారత్-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న వన్డేలో మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 23 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 89 పరుగులతో ఆటను కొనసాగిస్తుంది. భారత్ బౌలర్లలో సిరాజ్, వాషింగ్టన్ సుందర్ బంగ్లాను కోలుకోలేని దెబ్బతీశారు. బంగ్లా బ్యాట్స్‌మెన్లు ఎక్కడ నిలదొక్కుకోకుండా వికెట్లు తీయడంతో బంగ్లా పీకల్లోతు కష్టాల్లో పడింది. బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్లలో నిజ్మల్ హుస్సేన్ శాంటో(21), అనముల్ (11), ముషిఫిఖర్(12), లిట్టన్ దాస్(07), అపిప్ హోస్సేన్(0) పరుగులు చేశారు. వాషింగ్టన్ సుందర్ మూడు వికెట్లు పడగొట్టగా మహ్మాద్ సిరాజ్ రెండు వికెట్లు, ఉమ్రాన్ మాలిక్ ఒక వికెట్ తీశాడు. ప్రస్తుతం క్రీజులో మహదుల్లా(11), హసన్ మిరాజ్(9) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. మూడు వన్డేల సిరీస్‌లో భారత జట్టు 0-1తో వెనుకంజలో ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News