Thursday, January 23, 2025

26 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన బంగ్లా

- Advertisement -
- Advertisement -

చెన్నై: చిదంబరం స్టేడియంలో భారత్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో బంగ్లా తొమ్మిది ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 26 పరుగులు చేసింది. టీమిండియా ప్రస్తుతం 350 పరుగుల ఆధిక్యంలో ఉంది. షాద్మాన్ ఇస్లామ్ రెండు పరుగులు చేసి బుమ్రా బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డయ్యాడు. జకీర్ హుస్సేన్ మూడు పరుగులు చేసి ఆకాశ్ దీప్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. మోమినల్ హక్ ఆకాశ్ దీప్ బౌలింగ్‌లో డకౌట్ రూపంలో వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో నజ్ముల్ హుస్సేన్ శాంటో(15), ముష్ఫీకర్ రహీమ్ (4) పరుగులు చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 376 పరుగులు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News