Sunday, January 19, 2025

సరిహద్దులు దాటిన ప్రేమపెళ్లి… అనుమానంతో చంపాడు.. బార్డర్ లో అరెస్టు

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: బంగ్లాదేశ్ కు చెందిన యవకుడు బెంగళూరు యువతిని పెళ్లి చేసుకున్నాడు. గర్భవతి చేసి అనుమానంతో ఆమెను చంపేసి పారిపోతుండగా భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల వద్ద అతడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన సంఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రం సిలిగురిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వచ్చిన నాసిర్ హుస్సేన్ హార్డ్ వేర్ పని చేయడంలో సిద్ధ హస్తుడు కావడంతో లాప్ టాప్, స్మార్ట్ ఫోన్ల హార్డ్ వేర్ పనులను ఢిల్లీ, గురుగ్రామ్, కోల్ కతా తదితర ప్రాంతాలలో పని చేశాడు. బెంగళూరు సిలికాన్ సిటీ కావడంతో అక్కడ పని చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. బెంగళూరులో ఓ ఇల్లు అద్దెకు తీసుకొని నివసిస్తున్నాడు.

పక్కింట్లో ఉండే అమ్మాయి ఖనుమ్ తో లవ్ లో పడ్డాడు. ఇద్దరు గాఢంగా ప్రేమించుకోవడంతో సంవత్సరం క్రితం పెళ్లి చేసుకున్నారు. ఆమె సోదరి భర్త ఇలియాజ్ పాశాతో ఆమెకు వివాహేతర సంబంధం ఉన్నట్టు పలుమార్లు నాసిర్ అనుమానించాడు. ఆమె ప్రస్తుతం గర్భవతి కావడంతో అబార్షన్ చేయించాలని నిర్ణయం తీసుకున్నాడు. అబార్సన్ చేయించుకోనని వ్యతిరేకించడంతో ఆమెను చంపేశాడు. అనంతరం అక్కడి నుంచి తప్పించుకొని పశ్చిమ బెంగాల్ కు చేరుకున్నాడు. బెంగళూరు పోలీసులు పశ్చిమ బెంగాల్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సరిహద్దుల వెంట గాలింపు చర్యలు చేపట్టారు. బంగ్లాదేశ్ సరిహద్దుల వెంట సిలిగురి ప్రాంతంలో నాసిర్ అరెస్టు చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News