Friday, December 20, 2024

బంగ్లా ఎంపీ హత్య కేసులో పురోగతి

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో హత్యకు గురైన బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ అనర్ కేసులో పోలీస్‌లు కీలక పురోగతి సాధించారు. ఆయన శరీర భాగాల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఓ కాలువలో మానవ ఎముకలను గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి కీలక అనుమానితుడిని నేపాల్‌ల అరెస్ట్ చేసిన పోలీస్‌లు, భారత్‌కు తీసుకు వచ్చారు. అతడు ఇచ్చిన సమాచారం మేరకు గాలింపు చేపట్టగా, బాధితుడివిగా భావిస్తోన్న శరీర భాగాల ఎముకలు లభ్యమయ్యాయి. వీటిని ఫోరెన్సిక్ పరీక్ష కోసం పంపిస్తామని, ఇతర శరీర భాగాల కోసం గాలింపు కొనసాగుతోందని పోలీస్‌లు వెల్లడించారు.

అంతకు ముందు ఎంపీ శరీరానికి సంబంధించినదిగా భావిస్తోన్న దాదాపు మూడున్నర కిలోల మాంసపు ముద్దను హత్య జరిగిన సెప్టిక్ ట్యాంకు లోనే గుర్తించారు. ఇప్పటికే కొన్ని శరీర భాగాలు లభ్యం చేసుకున్నప్పటికీ, అవి నిర్ధారించుకోవడం కష్టంగా మారింది. దీంతో డిఎన్‌ఎ పరీక్ష చేయడానికి అధికారులు సిద్ధమయ్యారు. ఇందుకోసం బాధిత ఎంపీ కుమార్తె బంగ్లాదేశ్ నుంచి కోల్‌కతాకు రానున్నారు. మరోవైపు ఈ హత్య కోసం ఎంపీ సన్నిహితుడే నిందితులకు దాదాపు రూ.5 కోట్లు చెల్లించినట్టు ప్రాథమిక విచారణలో తేలింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News