- Advertisement -
ఢాకా : బంగ్లాదేశ్‌లో రైలు దాడి విధ్వంసం ఘటనకు సంబంధించి ఢాకా పోలీసులు శనివారం పెద్ద ఎత్తున అరెస్టుపర్వానికి దిగారు. ఎనమండుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ప్రధాన ప్రతిపక్షం బిఎన్‌పికి చెందిన ప్రముఖ నేత ఒకరు కూడా ఉన్నారు. శుక్రవారం అల్లరిమూకలు ఢాకాలో ఓ రైలుపై దాడి జరిపిన ఘటనలో పలువురు గాయపడ్డారు, కనీసం నలుగురు మృతి చెందారు.
ఎన్నికలకు ఒక్కరోజు ముందు బెనాపోల్ ఎక్స్‌ప్రెస్‌పై దాడి జరిపిన దుండగులు బోగీలకు నిప్పంటించారు. ఈ ఘటనపై భద్రతా యంత్రాంగం పెద్ద ఎత్తున విరుచుకు పడ్డారు. బిఎన్‌పి జాయింట్ కన్వీనర్ నబీ ఉల్లా నబీని , జుబో దళ్ కార్యకర్తలను అరెస్టు చేశారు. ప్రతిపక్ష పార్టీ యువజనవిభాగం రెచ్చగొట్టే ప్రసంగాలు, చర్యలకు దిగడం వల్లనే ఇప్పుడు హింసాకాండ జరిగిందని, ఓ వ్యూహం ప్రకారం రైలుకు నిప్పంటించారని అధికారులు స్పందించారు.
- Advertisement -