Sunday, December 22, 2024

భారత్ తో తొలి టెస్టు.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బంగ్లా

- Advertisement -
- Advertisement -

రెండు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో భాగంగా భారత్‌-బంగ్లాదేశ్ జట్ల మధ్య తొలి టెస్టు చెన్నైలోని ఎంఎ చిదంబరం స్టేడియం వేదికగా మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన బంగ్లా జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. సొంత గడ్డపై ఆడుతుండడంతో టీమిండియా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. ఈ టెస్టు సిరీస్ గెలువాలని బంగ్లా పట్టుదలగా ఉంది. ఇటీవల పాకిస్థాన్ జట్టును వారి సొంతగడ్డపైనే మట్టికరిపించిన ఉత్సాహంలో బంగ్లా బరిలోకి దిగుతోంది.

జట్ల వివరాలు:
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, కెఎల్ రాహుల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, అశ్విన్, సర్ఫరాజ్ ఖాన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ధ్రువ్ జురెల్, బుమ్రా, ఆకాశ్ దీప్, సిరాజ్.

బంగ్లాదేశ్: మహ్మదుల్ హసన్ జాయ్, షద్మన్ ఇసలామ్, జాకిర్ హసన్, మోమినుల్ హక్, నజ్ముల్ హుస్సేన్ షాంటో (కెప్టెన్), రహీం, షకిబ్, లిటన్ దాస్, జాకేర్ అలీ, మెహదీ హసన్ మిరాజ్, ఖాలేద్ అహ్మద్, హసన్ మహమూద్, తస్కిన్ అహ్మద్, నాహిద్ రాణా, తైజుల్ ఇస్లామ్, నయీం హసన్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News