చట్టొగ్రామ్: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో ఆతిథ్య బంగ్లాదేశ్ మొదటి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 318 పరుగులు చేసింది. ఓపెనర్లు మహ్మదుల్ హసన్ జాయ్, తమీమ్ ఇక్బాల్‌లు తొలి వికెట్‌కు 162 పరుగులు జోడించి శుభారంభం అందించారు. హసన్ జాయ్ 9 ఫోర్లతో 58 పరుగులు చేశాడు. మరోవైపు వన్‌డౌన్‌లో వచ్చిన నజ్ముల్ (1) నిరాశ పరిచాడు. కెప్టెన్ మోమినుల్ హక్ (2) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలువలేక పోయాడు. మరోవైపు తమీమ్ ఇక్బాల్ 217 బంతుల్లో 15 ఫోర్లతో 133 పరుగులు చేసి రిటైర్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. అయితే సీనియర్ బ్యాట్స్‌మన్ ముష్ఫికుర్ రహీం 53 (నాటౌట్), వికెట్ కీపర్ లిటన్ దాస్ 54 (నాటౌట్) మరో వికెట్ నష్టపోకుండా మంగళవారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి జట్టు స్కోరును 318 పరుగులకు చేర్చారు. ఇక లంక తొలి ఇన్నింగ్స్ స్కోరును అందుకోవాలంటే బంగ్లాదేశ్ మరో 79 పరుగులు చేయాలి.