Friday, December 20, 2024

అదరగొట్టిన బౌలర్లు.. టీమిండియా టార్గెట్ ఎంతంటే?

- Advertisement -
- Advertisement -

కాన్పూర్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ లో టీమిండియా బౌలర్లు అదరగొట్టారు. దీంతో బంగ్లాదేశ్ 146 పరుగులకే చేతులెత్తేసింది. ఓవర్ నైట్ స్కోరు 26/2తో చివరి రోజు ఆట ప్రారంభించిన బంగ్లాకు అశ్విన్ షాకిచ్చాడు. జట్టు స్కోరుకు పరుగులు జోడించిన అనంతరం మొమినుల్ హక్(2)ను ఔట్ చేసిన అశ్విన్.. భారత్ కు ఆదిలోనే బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత జడేజా, బుమ్రాలు కూడా చెలరేగడంతో బంగ్లా వరుసగా వికెట్లు కోల్పోయింది. దీంతో టీమిండియాకు కేవలం 94 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించింది. భారత బౌలర్లలో అశ్విన్, జడేజా, బుమ్రాలు తలో మూడు వికెట్లు పడగొట్టగా.. ఆకాశ్ దీప్ ఒక వికెట్ తీశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News