Wednesday, January 22, 2025

హిందూ మహాసముద్రంలో బంగ్లాదేశ్ నౌక హైజాక్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : హిందూ మహాసముద్రంలో బంగ్లాదేశ్ కార్గో నౌకను సముద్రపు దొంగలు మంగళవారం మధ్యాహ్నం హైజాక్ చేశారు. బంగ్లాదేశ్ లోని కబీర్ స్టీల్ అండ్ రీరోలింగ్ మిల్ గ్రూప్‌నకు చెందిన అబ్దుల్లా అనే కార్గో నౌక మొజాంబిక్ దేశం నుంచి బొగ్గు తీసుకుని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు బయలుదేరి హిందూ మహాసముద్రంలో ప్రయాణిస్తుండగా సముద్రపు దొంగలు చొరబడ్డారు. ఆయుధాలతో సిబ్బందిని బెదిరించి నౌకను స్వాధీనం చేసుకున్నారు.

నౌకలో 23 మంది సిబ్బంది ఉన్నారని, వారిని సంప్రదించేందుకు ప్రయత్నిస్తున్నట్టు నౌక యాజమాన్యం తెలియజేసింది. సిబ్బంది సురక్షితంగానే ఉన్నారని పేర్కొంది. నౌకను దుండగులు సొమాలియా తీరం వైపు తీసుకెళ్తున్నట్టు సమాచారం. బంగ్లాదేశ్ నౌకలు హైజాక్‌కు గురికావడం ఇది రెండోసారి. 2010లో ఇలాగే ఓ నౌకను అరేబియా సముద్రంలో దొంగలు హైజాక్ చేశారు. అందులోని 25 మంది సిబ్బందిన బందీలుగా చేసుకొని దాదాపు వంద రోజుల తరువాత విడిచిపెట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News