Wednesday, January 22, 2025

టీమిండియాతో టెస్టు సిరీస్.. బంగ్లాదేశ్ జట్టు ప్రకటన

- Advertisement -
- Advertisement -

భారత్–బంగ్లాదేశ్ జట్ల మధ్య సెప్టెంబరు 19 నుంచి రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం గురువారం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-5లో భాగంగా ఆడబోయే ఈ సిరీస్ కోసం 16 మంది సభ్యులతో జట్టును ఎంపిక చేసింది. ఈ జట్టుకు నజ్ముల్ హుస్సేన్ శాంటో కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఇక, జట్టులో ఒక అన్‌ క్యాప్డ్ బ్యాట్స్‌మన్‌ కు స్థానం కల్పించింది. గాయం కారణంగా దూరమైన షోరీఫుల్ ఇస్లాం స్థానంలో జకర్ అలీని టెస్టు జట్టులోకి తీసుకుంది.

సెప్టెంబరు 19 నుంచి చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో భారత్, బంగ్లాదేశ్ మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం బంగ్లాదేశ్ జట్టు ఆగస్టు 15న చెన్నై చేరుకుంటుంది. భారత ఆటగాళ్లు గురువారం(సెప్టెంబర్ 12 )న చెన్నైలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. కాగా, రెండో మ్యాచ్ సెప్టెంబర్ 27 నుంచి కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో జరగనుంది. ఆ తర్వాత రెండు దేశాల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ జరగనుంది. కాగా.. ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో పాకిస్థాన్‌ను వైట్‌వాష్ చేసిన సంగతి తెలిసిందే.

బంగ్లాదేశ్ జట్టు:

నజ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్), షద్మాన్ ఇస్లాం, జకీర్ హసన్, మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్ , షకీబ్ అల్ హసన్, లిటన్ దాస్, మెహదీ హసన్ మిరాజ్, జాకర్ అలీ, తస్కిన్ అహ్మద్ , హసన్ మహమూద్, నహిద్ రానా, తైజుల్ హసన్, జాయ్, నయీమ్ హసన్ మరియు ఖలీద్ అహ్మద్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News