- Advertisement -
సిల్హేట్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఆతిథ్య బంగ్లాదేశ్ పటిష్ఠస్థితికి చేరుకుంది. గురువారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. దీంతో బంగ్లాకు ఇప్పటి వరకు 205 పరుగుల ఆధిక్యం లభించింది. కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ షాంటో అజేయ శతకంతో జట్టును ఆదుకున్నాడు. ఒక దశలో 26 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్‌కు నజ్ముల్ అండగా నిలిచాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో అదరగొట్టిన నజ్ముల్ 10 ఫోర్లతో 104 పరుగులు చేసి నాటౌట్‌గా ఉన్నాడు. అతనికి మోమినుల్ హక్ (40), ముష్ఫికుర్ రహీం 43 (బ్యాటింగ్) సహకారం అందించారు. కాగా, బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 310 పరుగులు చేయగా, న్యూజిలాండ్ 317 పరుగులకు ఆలౌటైంది.
- Advertisement -