Sunday, September 8, 2024

బంగ్లాదేశ్ టార్గెట్ 116… మూడు జట్లకు సెమీస్ అవకాశాలు ఇలా?

- Advertisement -
- Advertisement -

కింగ్ స్టన్: టి20 వరల్డ్ కప్‌లో భాగంగా ఆఫ్ఘానిస్థాన్ -బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘాన్ 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 115 పరుగులు చేసింది. బంగ్లా ముందు 116 పరుగులు లక్ష్యాన్ని ఆఫ్ఘాన్ ఉంచింది. బంగ్లా బౌలర్ రిషద్ హుస్సేన్ మూడు వికెట్లు తీసి ఆప్ఘాన్ నడ్డివిరిచాడు. ఆఫ్ఘాన్ బ్యాట్స్ మెన్లలో రహ్మానుల్లా గుర్బాజ్ ఒక్కడే 43 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. మిగిలిన బ్యాట్స్‌మెన్లు తక్కువ పరుగులు చేయడంతో స్వల్ప లక్ష్యాన్ని బంగ్లా ముందు ఉంచారు. ఆఫ్ఘాన్ బ్యాట్స్‌మెన్లలో గుర్భాజ్ (43), రషీద్ ఖాన్(19 నాటౌట్), ఇబ్రాహీం జాడ్రాన్(18), అజ్మతుల్లా ఓమర్‌జాయి(10), గుల్బాదిన్ నైబ్(04), కరీమ్ జనత్(07 నాటౌట్), మహ్మాద్ నబీ(01) పరుగులు చేసి ఔటయ్యారు. ఆఫ్ఘాన్ బౌలర్లలో రిషద్ హుస్సేన్ మూడు వికెట్లు తీయగా టాస్కిన్ అహ్మాద్, ముస్తాపిజుర్ రహ్మాన్ చెరో ఒక వికెట్ తీశారు. ఈ మ్యాచ్ లో ఆప్ఘాన్ గెలిసి సెమీస్ కు చేరుకుంటుంది. ఒక వేళ ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ గెలిస్తే రన్ రేటు ఆధారంగా ఆఫ్ఘానిస్థాన్ లేదా ఆస్ట్రేలియా సెమీస్ కు చేరే అవకాశం ఉంది. 12.1 ఓవర్లలో బంగ్లాదేశ్ 116 పరుగులు, 12.5 ఓవర్లలో 121 పరుగులు, 12.3 ఓవర్లలో 119 పరుగులు చేస్తే బంగ్లా జట్టు సెమీస్ చేరుకునే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News