అడిలైడ్: ప్రపంచకప్‌లో భాగంగా భారత్ -బంగ్లాదేశ్ జరుగుతున్న మ్యాచ్ లో భారత్ 185 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నీర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ మరోసారి సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 వరల్డ్‌కప్ మ్యాచ్‌లో కోహ్లీ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. 44 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 64 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ టోర్నీలో కోహ్లీకి ఇది మూడవ అర్ధ సెంచరీ కావడం విశేషం. టోర్నీలో ఫామ్‌లోలేని ఓపెనర్ కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేశాడు. అతను 32 బంతుల్లో మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 50 రన్స్ చేసి ఔటయ్యాడు. ఇక సూర్య కుమార్ వేగంగా ఇన్నింగ్స్ ఆడాడు. అతను కేవలం 16 బంతుల్లో 4 ఫోర్లతో 30 రన్స్ చేశాడు. చివర్లో అశ్విన్ ఆరు బంతుల్లో 13 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు.