Sunday, January 19, 2025

సెంచరీతో చెలరేగిన అసలంకా… బంగ్లా లక్ష్యం 280

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: వరల్డ్ కప్‌లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియంలో శ్రీలంక-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో లంక 50 ఓవర్లలో 279 పరుగులు చేసి ఆలౌటైంది. బంగ్లా ముందు లంక 280 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. చరిత అసలంకా సెంచరీతో చెలరేగాడు. అసలంకా 105 బంతుల్లో 108 పరుగులు చేశాడు. లంక బ్యాట్స్‌మెన్లలో పతుమ్ నిశాంక (41), సదీరా సమరా విక్రమార్కా(41) , దనుంజయ్ దిసిల్వా(34), మహీష్ తీక్షణా(22), కుశాల్ మెండీస్(19) పరుగులతో పర్వాలేదనిపించారు. మిగిలిన బ్యాట్స్‌మెన్లు నిరాశ పరిచారు. బంగ్లా బౌలర్లలో తాంజమ్ హషన్ షకీబ్ మూడు వికెట్లు, సోరిఫూల్ ఇస్లామ్, షకిబ్ అల్ హసన్ చెరో రెండు వికెట్లు, మెహిడీ హసన్ మిరాజ్ ఒక వికెట్ తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News