చెన్నై: చిదంబరం స్టేడియంలో భారత్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ మూడో రోజు టీమిండియా 64 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 287 పరుగులు వద్ద డిక్లేర్డ్ చేసింది. దీంతో భారత జట్టు 514 పరుగుల ఆధిక్యంలో ఉంది. బంగ్లాదేశ్ రెండు రోజులలో 515 పరుగులు చేస్తే గెలిచే అవకాశం ఉంది. భారత జట్టు పది వికెట్లు తీస్తే గెలుస్తుంది. శుభ్‌మన్ గిల్, రిషభ్ పంత్ సెంచరీలతో చెలరేగారు. పంత్ 128 బంతుల్లో 109 పరుగులు చేసి హసన్ మిరాజ్ బౌలింగ్‌లో అతడికే క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. నాలుగో వికెట్‌పై ఇద్దరు 167 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రస్తుతం క్రీజులో శుభ్‌మన్ గిల్(119), కెఎల్ రాహుల్(22) బ్యాటింగ్‌లో ఉన్నారు. బంగ్లా బౌలర్లలో మెహిడీ హసన్ మిరాజ్ రెండు వికెట్లు తీయగా టస్కిన్ అహ్మద్, నహిద్ రానా చెరో ఒక వికెట్ తీశారు.
భారత్ తొలి ఇన్నింగ్స్: 376
బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్: 149