Sunday, January 19, 2025

బంగ్లాదేశ్ లక్ష్యం 365

- Advertisement -
- Advertisement -

ధర్మశాల: వరల్డ్‌కప్‌లో భాగంగా హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఇంగ్లాండ్ – బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 364 పరుగులు చేసింది. బంగ్లా ముందు 365 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ ఉంచింది. డేవిడ్ మలాన్ సెంచరీతో వీరవిహారం చేశారు. మలాన్ 107 బంతుల్లో 140 పరుగులు చేసి మహేడి హసన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. జానీ బయిస్ట్రో(52), జోయ్ రూట్(82) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్లలో జోష్ బట్లర్(20), హరీ బ్రూక్(20), శ్యామ్ కరన్(11), క్రిష్ వోక్స్(14), అదిల్ రషీద్(11) మార్క్ వుడ్(06 నాటౌట్), రీస్ టోప్లే(1) నాటౌట్ పరుగులు చేసి ఔటయ్యారు. లైమ్ లివింగ్‌స్టోన్ పరుగులేమి చేయకుండా డకౌట్ రూపంలో ఔటయ్యారు. బంగ్లా బౌలర్లలో మహెడీ హసన్ నాలుగు వికెట్లు, షోర్ఫిల్ ఇస్లామ్ మూడు వికెట్లు, టస్కీన్ అహ్మాద్, షకీబ్ అల్ హసన్ చెరో ఒక వికెట్ తీశారు.

Also Read: రూ. 4 కోట్ల డిపాజిట్లు స్వాహా: పోస్టుమాస్టర్ పరారీ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News