Thursday, January 23, 2025

బంగ్లాదేశ్ టార్గెట్ 383

- Advertisement -
- Advertisement -

ముంబయి: వరల్డ్ కప్‌లో భాగంగా వాంఖేడ్ స్టేడియంలో దక్షిణాఫ్రికా-బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా 50 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 382 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ ముందు 383 పరుగుల లక్ష్యాన్ని సపారీలు ఉంచారు. క్వింటన్ డికాక్ భారీ సెంచరీతో విజృంభించాడు. డికాక్ 140 బంతుల్లో 174 పరుగులు చేసి హసన్ మహ్ముద్ బౌలింగ్‌లో నసుమ్ అహ్మద్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. హెన్రీచ్ క్లాసెన్, మక్రమ్, మిల్లర్ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. చివరలో డేవిడ్ మిల్లర్ 15 బంతుల్లో 34 పరుగులు చేశాడు. క్లాసెన్ 49 బంతుల్లో 90 పరుగులు చేసి ఔటయ్యాడు.  మిగిలిన బ్యాట్స్‌మెన్ స్వల్ప స్కోర్లకే పరిమితమయ్యారు. మూడు వికెట్‌పై మక్రమ్-డికాక్ 131 పరుగులు, నాలుగో వికెట్‌పై డికాక్- క్లాసెన్ 142 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. బంగ్లా దేశ్ బౌలర్లలో మిరాజ్, ఇస్లామ్, హసన్ తలో ఒక వికెట్ తీయగా మహ్ముద్ రెండు వికెట్లు తీశారు. ఈ వరల్డ్ కప్ లో డికాక్ 400కు పైగా పరుగులు చేసి తొలి స్థానంలో ఉన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News