Sunday, December 22, 2024

టి20 సిరీస్‌కు బంగ్లా జట్టు ప్రకటన

- Advertisement -
- Advertisement -

ఢాక : ప్రస్తుతం జరుగున్న టెస్టు సిరీస్ అనంతరం భారత్ జరిగే టి20 సిరీస్‌కు బంగ్లాదేశ్ జట్టును ప్రకటించింది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు. 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఆదివారం ప్రకటించారు. కాగా, ఈ జట్టుకు నజ్ముల్ హొస్సేన్ శాంటో సారధిగా ఎంపికయ్యాడు. ఇక ఆల్‌రౌండర్ మెహిదీ హసన్‌ను సుదీర్ఘ విరామం అనంరతం తిరిగి జట్టులోకి తీసుకున్నారు. లెఫ్ట్ హ్యాండ్ ఓపెనింగ్ బ్యాటర్ పర్వేజ్ హొసేన్, లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్ రకీబుల్ హసన్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చారు. సీనియర్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ టి20లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.
బంగ్లాదేశ్ జట్టు వివరాలు..
నజ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్), తంజిద్ హసన్ తమీమ్, పర్వేజ్ హుస్సేన్ ఎమోన్, తౌహిద్ హృదయ్, మహమూద్ ఉల్లా, లిట్టన్ కుమార్ దాస్, జాకెర్ అలీ అనిక్, మెహిదీ హసన్ మిరాజ్, షక్ మహేదీ హసన్, రిషద్ హొసేన్, ముస్తాఫిజుర్ రహ్మాన్, తస్కిన్ అహ్మద్, షోరిఫుల్ ఇస్లాం, తంజిమ్ హసన్ సాకిబ్, రకీబుల్ హసన్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News