Saturday, December 21, 2024

బంగ్లాదేశ్ ఘన విజయం

- Advertisement -
- Advertisement -

నేపియర్: న్యూజిలాండ్‌తో బుధవారం జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో బంగ్లా సిరీస్‌లో 10 ఆధిక్యాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆతిథ్య న్యూజిలాండ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. ఆరంబం నుంచే బంగ్లా బౌలర్లు చెలరేగి బౌలింగ్‌చేశారు. ఓపెనర్లు ఫిన్ అలెన్ (1), సిఫర్ట్ (0) విఫలమయ్యారు. వన్‌డౌన్‌లో వచ్చిన డారిల్ మిఛెల్ 14 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. గ్లెన్ ఫిలిప్స్ (౦) ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. దీంతో కివీస్ 20 పరుగులకే నాలుగు వికెట్లను కోల్పోయింది. ఈ దశలో ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను నిషమ్ తనపై వేసుకున్నాడు. అతనికి చాప్‌మన్ అండగా నిలిచాడు. చాప్‌మన్ 2ఫోర్లు, ఒక సిక్సర్‌తో 19 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. కెప్టెన్ సాంట్నర్ రెండు బౌండరీలతో 23 పరుగులు చేశాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన నిషమ్ 29 బంతుల్లోనే 3 సిక్సర్లు, 4 ఫోర్లతో 48 పరుగులు సాధించాడు.

చివర్లో మిల్నె 14 (నాటౌట్) కాస్త రాణించాడు. దీంతో కివీస్ స్కోరు 134 పరుగులకు చేరింది. ప్రత్యర్థి బౌలర్లలో షరిఫుల్ ఇస్లామ్ మూడు, మెహదీ హసన్, ముస్తఫిజుర్ రెండేసి వికెట్లను తీశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 18.4 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ రోని తాలుక్‌దార్ (10) ఆరంభంలోనే పెవిలియన్ చేరాడు. అయితే మరో ఓపెనర్ లిటన్ దాస్ ప్రత్యర్థి బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు నడిపించాడు. అతనికి కెప్టెన్ నజ్ముల్ షాంటో (19), సౌమ్య సర్కార్ (22), తౌహిద్ హృదయ్ (19) అండగా నిలిచారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన లిటన్ దాస్ రెండు ఫోర్లు, ఒక సిక్స్‌తో 42 పరుగులు చేసి అజేయంగా ఉన్నాడు. అతనికి మెహదీ హసన్ 19(నాటౌట్) సహకారం అందించాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News