Thursday, December 26, 2024

బంగ్లాదేశ్‌కు చావో రేవో

- Advertisement -
- Advertisement -

లాహోర్ : ఆసియాకప్‌లో భాగంగా ఆదివారం పాకిస్థాన్‌లోని లాహోర్‌లో జరిగే గ్రూప్‌బి మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌తో బంగ్లాదేశ్ తలపడనుంది. శ్రీలంక తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓడిన బంగ్లాదేశ్‌కు ఈ మ్యాచ్ చావో రేవోగా తయారైంది. సూపర్4 అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్‌లో గెలవడం తప్పించి బంగ్లాకు మరో మార్గం లేకుండా పోయింది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో ఓడితే బంగ్లాదేశ్ ఆసి యా కప్ నుంచి నిష్క్రమిస్తోంది. ఇలాం టి స్థితిలో బంగ్లాదేశ్‌పై తీవ్ర ఒత్తిడి నెలకొంది. మరోవైపు అఫ్గానిస్థాన్‌కు ఈ మ్యాచ్‌లో ఓడినా మరో ఛాన్స్ ఉంటుం ది. లంకతో జరిగే మ్యాచ్‌లో గెలిస్తే నాకౌట్‌కు చేరే అవకాశాలు ఉంటాయి. ఇరు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉండడంతో మ్యాచ్ ఆసక్తికరంగా సాగడం ఖాయం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News