- Advertisement -
సిల్హెట్: న్యూజిలాండ్‌తో మంగళవారం ప్రారంభమైన తొలి టెస్టులో ఆతిథ్య బంగ్లాదేశ్ మొదటి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్‌కు శుభారంభం లభించలేదు. ఓపెనర్ జాకీర్ హసన్ (12) ఆరంభంలోనే పెవిలియన్ చేరాడు.
అయితే మరో ఓపెనర్ హసన్ జాయ్ అద్భుత బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నాడు. అతనికి కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ షాంటో (37), మోమినుల్ హక్ (37) అండగా నిలిచాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన హసన్ జాయ్ 11 ఫోర్లతో 86 పరుగులు చేశాడు. మిగతా వారిలో షాదత్ (24), నూరుల్ హసన్ (29), మెహదీ హసన్ (20) పరుగులు సాధించారు. కివీస్ బౌలర్లలో గ్లెన్ ఫిలిప్స్ నాలుగు, జామీసన్, ఎజాజ్ పటేల్ రెండేసి వికెట్లు పడగొట్టారు.
- Advertisement -